'జాగో ముస్లిం... చలో గుంటూరు' లో అలీ...!!
- November 28, 2016
ఎన్నికల్లో ముస్లింల ఓట్లు వేయించుకుంటున్న రాజకీయ పార్టీలు హామీలు నెరవేర్చకపోగా చివరకు ముస్లింలకే టోపీలు పెడుతున్నాయని ప్రముఖ సినీనటుడు అలీ విమర్శించారు. నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో 'జాగో ముస్లిం... చలో గుంటూరు' పేరుతో తలపెట్టిన ముస్లింల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకే ముస్లింలు ఓటేయాలని పిలుపునిచ్చారు.ముస్లింల పర్వదినమైన రంజాన్ రోజునే రాజకీయ నాయకులకు ముస్లింలు గుర్తొస్తారని విమర్శించారు.ఆరోజు వారు తలపై టోపీలు పెట్టుకోవడమే కాకుండా ముస్లింల నెత్తిపైనా టోపీలు పెడుతున్నారని అన్నారు. చదువుతోనే ప్రగతి సాధ్యమని, బలవంతపు మతమార్పిడులు మంచివి కావని సూచించారు. టీడీపీ ఎమ్మెల్సీ షరీఫ్ మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైదరాబాద్‌లోని మక్కామసీదు తరహాలో షాహీమసీదు, షాదీఖానా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.ముస్లింలకు సెక్యూరిటీ లేకుండా వడ్డీలేని రుణాలు అందజేయాలని సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ మాట్లాడుతూ ముస్లింలంతా సమష్టిగా ఉంటే ఏ శక్తులు ఏం చేయలేవన్నారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు సుభాని మాట్లాడుతూ ముస్లింల సహనాన్ని రాజకీయపార్టీలు పరీక్షించవద్దన్నారు. ముస్లింలంతా ఏకమై సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి మాట్లాడుతూ కొన్ని రాజకీయశక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నాయని, అటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ముస్లింల ఆత్మీయ సమావేశానికి హాజరైన సినీనటుడు అలీకి సంఘ నాయకులు, నరసరావుపేట టూ వీలర్స్ అసోసియేషన్, ఫ్యాన్స్ నాయకులు గజమాల, పుష్పగుచ్ఛాలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు ఎండీ నసీర్ అహ్మద్, షేక్ షౌకత్, అబ్దుల్ వహీద్, డాక్టర్ రసూల్, బాజీ, ఫిరోజ్ పలువురు మైనార్టీ నాయకులు ఉన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







