రక్తహీనతతోనూ బాధపడేవారు ఉలవలు తరచూ ఆహారంలో తీసుకుంటే మంచిది..
- November 28, 2016
ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు దాణాగా వాడే ఉలవలు ఇళ్ళలో తినడానికి అంతగా ఇష్టపడేవారు కాదు. ఒకవేళ ఎవరైనా ఉలవలు గుగ్గిళ్ళుగా చేసుకొని తినడమో లేక చారు తయారుచేసుకుని వాడడమో చేస్తే వారు పేదవారై ఉండేవారు . కానీ నేడు ఉలవలు - ఉలవచారు విందు వినోదాలలో వాడడం స్టేటస్ సింబల్ అనడంలో అతిశయోక్తి లేదు. ఉలవచారు నేడు అత్యంత ఖరీదైన వంటకం.ఉలవలను ముఖ్యంగా చారు రూపంలో వాడతతారు. ఇవి వేడిచేసే గుణం కలవి. ఉలవచారు చిక్కగా ఎర్రని లేక ఇటుకరాయి రంగులో ఉంటుంది. తినడానికి ఉలవచారు కమ్మగా ఉన్నప్పటికీ వాతము చేసే గుణము ఉన్న వారు దీనిని ప్రత్యేకించి వాడవచ్చు. ఉలవలు మూత్రకోశంలోని రాళ్ళను కరిగించే గుణం ఉంటుంది. కాబట్టి మూత్రాశయ వ్యాధులలో దీనిని ఇతర మందులతో పాటుగా ఆహారంలో వాడవచ్చు.ఉలవలు స్త్రీలలో ఋతు స్రావమును జారీ చేసే గుణం కలిగి ఉంది. ఋతువు సరిగా రాని వారు ఉలవలు వాడటం వల్ల ఉపయోగంగా ఉంటుంది. అధికంగా చెమటలు పడుతున్న వారు ఆహారంలో ఉలవలు వాడటం వల్ల చెమటలు హరించిపోతాయి. ఉలవలు మంచి ప్రొటీన్లను కలిగి ఉన్నాయి. నీరసమును పోగొడుతాయి. నిస్సత్తుతోను, రక్తహీనతతోనూ బాధపడేవారు ఉలవలు తరచూ ఆహారంలో తీసుకుంటే మంచిది. ఉలవలు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. అజీర్తిని పోగొడుతుంది. కడుపులో వాతమును త్వరగా తగ్గిస్తుంది. అజీర్తి విరేచనాలు అయ్యేవారు ఉలవచారు వాడటం వల్ల మేలు జరుగుతుంది. ఉలవచారు కుక్క కరిచిన వారు అసలు తీసుకోకూడదు. కుక్క కరిచి చాలా రోజులయినప్పటికీ ఉలవచారు వాడారంటే వారి పరిస్థితి ప్రమాదంలో పడుతుంది. రేబిస్ వైరస్ విజృంభించి ప్రాణాపాయం కలిగించవచ్చు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









