బహిరంగంగా మద్యం తాగేవారిపై కఠిన చర్యలు..

- November 28, 2016 , by Maagulf
బహిరంగంగా మద్యం తాగేవారిపై కఠిన చర్యలు..

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బహిరంగంగా మద్యం తాగితే భారీ జరిమానాలు విధిస్తున్నట్లు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖామంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. నవంబరు 7వతేదీ నుంచి మూడు వారాల్లో 360 మంది బహిరంగంగా మద్యం తాగడంతో పాటు న్యూసెన్స్ సృష్టించిన 360 మందిని అరెస్టు చేశామని సిసోడియా పేర్కొన్నారు.
ఎక్సైజ్ యాక్టు సెక్షన్ 40 కింద మందుబాబులపై మూడంచెల విధానంలో చర్యలు తీసుకునేలా కార్యాచరణ రూపొందించామన్నారు. మొదటి విడతగా వీధుల్లో బహిరంగంగా మద్యం తాగడాన్ని నివారించాలని కోరుతూ ప్రచారం చేపడతామన్నారు. అనంతరం వీధుల్లో మద్యం తాగిన వారికి ఐదువేల రూపాయల జరిమానా విధిస్తామని చెప్పారు. మద్యం తాగి వీధుల్లో అల్లరి చేసిన వారిపై పదివేల జరిమానా విధిస్తామన్నారు.ఢిల్లీలో మహిళల భద్రత కోసం బహిరంగంగా మద్యం తాగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని సిసోడియా వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com