మెనా టెలికామ్‌: టాప్‌ స్పీడ్‌, ఎక్స్‌ప్లోజివ్‌ డౌన్‌లోడ్స్‌

- November 28, 2016 , by Maagulf
మెనా టెలికామ్‌: టాప్‌ స్పీడ్‌, ఎక్స్‌ప్లోజివ్‌ డౌన్‌లోడ్స్‌

మనామా: మెనా బిజినెస్‌ కస్టమర్స్‌ ఇకపై 1.25టెరాబైట్స్‌ డౌన్‌లోడ్‌ కెపాసిటీని పొందే అవకాశం ఉంది. కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. హైస్పీడ్‌తోపాటు నమ్మకమైన సేవలు అందించే తమ సంస్థ, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు తమ నెంబర్‌ని అలాగే ఉంచుకుంటూ మెనా టెలికామ్‌కి మారవచ్చనీ, ఉచితంగా 77IIIIIII రేంజ్‌ నెంబర్‌ని కూడా పొందే వీలుందని సంస్థ ప్రతినిథులు తెలిపారు. మెనా టెలికామ్‌, తన సొంత ఫైబర్‌ లింక్‌ని బహ్రెయిన్‌ వ్యాప్తంగా కలిగి ఉంది. మైకోవేవ్‌, 4జి ఎల్‌టికి వైమాక్స్‌ వంటివి మెనా ప్రత్యేకతలు. అన్ని రకాల వ్యాపార అవసరాలకూ సరిపడే ప్యాకేజీలతో మెనా టెలికామ్‌ సేవలు అందిస్తోంది. బ్యాంకులకు సెక్యూర్‌ విపిఎన్‌, రిమోట్‌ సర్వైలెన్స్‌సిస్టమ్స్‌, సిసిటివి సొల్యూషన్స్‌, పిబిఎక్స్‌ సిస్టమ్స్‌ వంటివి మెనా టెలికామ్‌ ప్రత్యేకతలు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com