ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ టాయ్ లెట్ లో పాత నోట్లు ...
- November 30, 2016
నల్లధనం దాచుకున్న కుబేరులు కొందరు పాతనోట్లను మార్చుకునేందుకు అడ్డదారులు తొక్కుతుంటే.. మరి కొందరు వాటిని వదిలించుకునేందుకు పాట్లు పడుతున్నారు. నోట్లను కాల్చి నదిలో పడేయడం, కత్తరించి రోడ్ల పక్కన విసిరేయడం, చెత్తకుండీల్లో వేయడం.. వంటి పనులు చేస్తున్నారు. తాజాగా గుర్తు తెలియని వ్యక్తులు ఢిల్లీ-భువనేశ్వర్ రాజధాని ఎక్స్ ప్రెస్ టాయ్ లెట్ లో పాత నోట్లను పడేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో రైల్వే పోలీసులు 4.5 లక్షల రూపాయల నగదును గుర్తించారు. అన్ని రద్దయిన 500, 1000 రూపాయల నోట్లు ఉన్నాయని తెలిపారు.
రాజధాని ఎక్స్ ప్రెస్ బి-6 కోచ్ లో ఈ మొత్తం దొరికిందని, స్వాధీనం చేసుకున్నామని రైల్వే ఎస్పీ సంజయ్ కౌషల్ చెప్పారు.
ఈ డబ్బును ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేసినట్టు తెలిపారు. కేంద్రపడా జిల్లాకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు రైల్వే పోలీసు వర్గాలు వెల్లడించాయి. రైలు టాయ్ లెట్ లోపల ఎవరో కొన్ని నిమిషాల పాటు లాక్ చేసుకుని ఉన్నట్టు కొందరు ప్రయాణికులు సమాచారం అందించారని, రైల్వే పోలీసులు వెళ్లి టాయ్ లెట్ డోర్ తెరవగా ముగ్గురు వ్యక్తులు బయటకు వచ్చినట్టు చెప్పారు. టాయ్ లెట్ లో తనిఖీ చేయగా పాత నోట్ల కరెన్సీ లభించిందని, ఈ ముగ్గురిని విచారిస్తున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









