గూగుల్ యాజమాన్యంపై దుమారం
- September 01, 2015
గూగుల్ సంస్థ తమ కంపెనీల విషయాలను తక్కువ చేసి చూపుతుందని అమెరికా, యూరప్ ఖండాలలో ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అదేవిధంగా భారత్ లో కూడా ఈ సమస్యలు తలెత్తుతున్నాయిని పలు కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు చెందిన నిఘా విభాగం ఆ సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తడంతో పాటు వివరణ కోరింది. కంపెనీల మధ్య నెలకొన్న కాంపిటీషన్ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని కొందరు వాదిస్తున్నారు. కంపెనీల ఆర్థిక లావాదేవిలు, ఆన్ లైన్ ప్రకటనల ర్యాంకింగ్స్, సేవల వివరాలను గూగుల్ సెర్చ్ ఇంజన్ తప్పుగా చూపిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బ్రెజిల్, మెక్సికోలలో సొంత కంపెనీల సేవలను ఎక్కువ చేసి చూపిస్తూ ఇతర కంపెనీల మార్కెట్లను దెబ్బతీస్తుందని స్థానిక వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. ఇదేతరహాలో భారత వెబ్ సైట్ భారత్ మాట్రిమోని, కన్స్యూమర్ అండ్ ట్రస్ట్ సొసైటీలు కూడా అవాస్తవాలను ప్రచారం చేయడంతో తమ సైట్ల సేవలు కాస్త నెమ్మదించాయని, ప్రజలలో అపనమ్మకాలు పెరిగే అవకాశాలు లేకపోలేదని ఆరోపిస్తున్నాయి. సెప్టెంబర్ 10 లోపు వివరణ ఇచ్చుకోవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, గూగుల్ సంస్థ నిర్వాహకులకు సూచించగా, గడువును మరింత పొడిగించాలని గూగుల్ కోరుతోంది.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







