పూజారి చెప్పిన మంత్రం

- September 01, 2015 , by Maagulf
పూజారి చెప్పిన మంత్రం

ఏటి ఒడ్డున ఒక రామాలయం ఉండేది. అక్కడ రాములోరు చాలా మహిమ గలవారు. ఆ రామాలయానికి ఒక అవ్వ ఏరు దాటి ప్రతిరోజూ రాముడి అభిషేకానికి పాలు తీసుకుని వచ్చేది. ఒకరోజు ఆ అవ్వ రావడం లేటయ్యింది. పూజారి ఆమెతో అవా ఈ రోజు ఎందుకు లేటయ్యింది అని అడిగాడు. అందుకు అవ్వ బాబూ ఏరు దాటి వచ్చేటప్పటికి లేటయ్యింది. పడవవాడు రావాలి కదా అందుకే లేటయ్యింది అంది. ఎందుకు పడవలో రావడం.. రామా రామా అనుకుంటూ ఏటి మీద నడుచుకుంటూ వచ్చెయ్యచ్చు కదా అని పరిహాసం చేశాడు. అప్పట్నుంచీ అవ్వ రోజూ కన్నా తొందరగా పాలు తీసుకుని వచ్చేస్తుంది. ఒకరోజు పూజారి మళ్లీ అవ్వతో ఏంటి అవ్వా! ఈ మధ్య తొందరగా వచ్చేస్తున్నావ్‌ అని అడిగాడు. మీరు చెప్పిన ఉపాయమే కదా పంతులుగారూ! అని చెప్పింది. నేను చెప్పిన ఉపాయమా! ఏంటది అన్నాడు ఆశ్చర్యంగా.. అదే మీరు రామా రామా అనుకుంటూ ఏటి మీద నడుచుకుని వచ్చేస్తున్నాను. డబ్బులు కూడా ఖర్చు కావడం లేదు బాబూ! అంది. నిజంగానే ఏటి మీద నడుస్తున్నావా? ఏది చూద్దాం పద అని ఇద్దరూ కలిసి ఏటి వద్దకు వచ్చారు. అవ్వ ఏటి మీద చక్కగా నడుచుకుని అవతలి ఒడ్డుకు వెళ్లిపోతుంది. ఏటి మధ్యకు వెళ్లిన తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. పూజారి పంచె పైకి పెట్టుకుని ఏటి మీద నడవడానికి ప్రయత్నిస్తున్నాడు కానీ మోకాలి లోతు నీటిలో మునగిపోతున్నాడు. అవ్వ అది చూసి ఏంటి స్వామి మీరు చెప్పిన మంత్రం మీకే పని చెయ్యడంలేదు అంది. నీవు చాలా అదృష్టవంతురాలివి అవ్వా. నీకు ఆ రామయ్య అండగా ఉండడంతో నువ్వు మాత్రమే ఏటి మీద నడవగలుగుతున్నావ్‌ అన్నాడు. ఎంతో సంతోషించి అవ్వ రామా రామా అనుకుంటూ అవతలి ఒడ్డుకు చేరుకుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com