జనవరి 1 నుంచి గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
- December 01, 2016
వచ్చే జనవరి 1 నుంచి గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పురపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో అధికార పక్షం వారుంటే తొలి కేసు వారిపైనే నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, చెత్త వేసినా.. జరిమానా విధించే మెజిస్టీరియల్ అధికారాలు డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లకు కల్పిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలు- పౌర సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు - మౌలిక వసతుల కల్పనపై గురువారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, తలసానితో పాటు, నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.గ్రేటర్‌లో నాలాలపై ఆక్రమణలను ఏకపక్షంగా తొలగించకుండా.. ప్రత్యామ్నాయ ఇంజనీరింగ్ అంశాలను పరిశీలిస్తామని సమీక్ష అనంతరం మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నాలాల లోతు పెంచడం, ఎత్తుగా రిటైనింగ్ వాల్స్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై దృష్టి సారిస్తామని ఆయన తెలియజేశారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితుల్లో నాలాలపై 900కు పైగా ఆక్రమణలు తొలగించామని తెలిపారుసమగ్ర సర్వే చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. గ్రేటర్‌లోని 390 కిలోమీటర్ల నాలాల్లో 216 కి.మీ సర్వే పూర్తైందని, వాటిపై 8239 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించామన్నారు. వాటిని ఏకపక్షంగా తొలగించవద్దన్న ఎమ్మెల్యేల సూచన మేరకు ప్రత్యామ్నాయ అంశాలు పరిశీలిస్తున్నామన్నారు. తప్పదనుకుంటే మాత్రం తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.కాగా, శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడంపై సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎన్‌వీఎ్‌సఎస్ ప్రభాకర్, ఉప్పల్ భగాయత ప్లాట్ల కేటాయింపులో తమ అభిప్రాయం తీసుకోలేదని ఆక్షేపించారు. జీహెచ్‌ఎంసీకి నిధులు కేటాయించకుండా, సంస్థ ఖజానా నుంచి ఇతర విభాగాలకు నిధులు మళ్లిస్తున్నారని ఎమ్మెల్సీ జాఫ్రీ విమర్శించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







