పెరూలో లంపా పట్టణానికి 58 కిలో మీటర్ల దూరంలో భూకంపం...
- December 02, 2016
పెరూలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ‍్రత 5.5గా నమోదైంది. భూప్రకంపనలకు ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కాగా ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.పెరూలో లంపా పట్టణానికి 58 కిలో మీటర్ల దూరంలో 30 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. 30 సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు. లంపా, పరాటియా జిల్లాలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. పెరూలో ఏడాదికి దాదాపు 200 భూకంపాలు వస్తుంటాయి. వీటిలో చాలావరకు ప్రజలు గుర్తించని అతిస్వల్ప ప్రకంపనలు ఉంటాయి. పెరూలో చివరిసారిగా 2007లో వచ్చిన భారీ భూకంపంలో 595 మంది మరణించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







