6 అరామ్‌కో మెగా ప్రాజెక్టుల్ని ప్రారంభించిన కింగ్‌ సల్మాన్‌

- December 02, 2016 , by Maagulf
6 అరామ్‌కో మెగా ప్రాజెక్టుల్ని ప్రారంభించిన కింగ్‌ సల్మాన్‌

దహ్రాన్‌: కింగ్‌ సల్మాన్‌ గురువారం ఆరు సౌదీ అరామ్‌కో మెగా ప్రాజెక్టుల్ని కంపెనీ మెయిన్‌ బిల్డింగ్‌లో ప్రారంభించారు. సిఇఓ అమిన్‌ నాజర్‌ స్పీచ్‌తో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా కంపెనీ అచీవ్‌మెంట్స్‌ని ఆయన వివరించారు. కింగ్‌ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో జెయింట్‌ ఖురైస్‌ ఆయిల్‌ ఫీల్డ్‌ కూడా ఒకటి. అరేబియన్‌ లైట్‌ క్రూడ్‌ ఆయిల్‌ - సౌదీ ప్రొడక్షన్‌ని 1.2 మిలియన్‌ బ్యారెల్స్‌ (రోజుకి) అలాగే 420 మిలియన్‌ స్టాండర్డ్‌ క్యూబిక్‌ ఫీట్‌ గ్యాస్‌ని వెలికి తీయడమే లక్ష్యంగా ఖురైస్‌ ప్రాజెక్ట్‌ ప్రధాన ఉద్దేశ్యమని సంస్థ ప్రతినిథులు తెలిపారు. ప్రాజెక్ట్‌ కెపాసిటీ 900,000 బ్యారెల్స్‌ క్రూడాయిల్‌ (రోజుకి), అలాగే మనీలా ఫీల్డ్‌కి సంబంధించిన వివరాల్లోకి వెళితే, 90 మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్‌ నాన్‌ అసోసియేటెడ్‌ గ్యాస్‌ మరియు 65,000 బ్యారెల్స్‌ కండెన్సేట్ల సామర్థ్యం ఈ ప్రాజెక్టుకి ఉంది. సౌదీ ఎనర్జీ నీడ్స్‌ కోసం వాసిత్‌లోని గ్యాస్‌ ప్లాంట్‌ ఉపయోగపడుతంది. మిగతా ప్రాజెక్టులు కూడా దేశ అవసరాల కోసం అలాగే, సౌదీ అరేబియా సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తాయని సంస్థ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com