ఒక శాతం పెరిగిన కతర్ జనాభా సంఖ్య

- December 02, 2016 , by Maagulf
ఒక శాతం పెరిగిన కతర్ జనాభా సంఖ్య

కతర్ యొక్క జనాభా వృద్ధి స్వల్పంగా నవంబర్ 1 వ తేదీ నుంచి నవంబర్ 30  వ తేదీ  మధ్య కాలంలో ఒక శాతం పెరిగిందని   ప్రణాళిక అభివృద్ధి మరియు గణాంకాలు మంత్రిత్వ శాఖ (ఎం డి పిఎస్) గురువారం ఒక ప్రకటనలో జారీ చేసింది. గత 15 సంవత్సరాల కాలంలో ఈ తరహా వృద్ధి నమోదు కాలేదని అందుకు సాక్ష్యంగా గణాంకాలను విడుదల చేసింది. కేవలం 30 రోజుల కాల వ్యవధిలో సుమారు 1 శాతం (26 వేలమంది) పెరిగినట్లు చెప్పారు. అక్టోబర్ ౩౧ వ తేదీన మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం  2,611,000 జనాభాగా ఉన్నారు.అయితే, కొత్త లెక్కల ప్రకారం 2,637,000 కు పెరిగింది.గత ఏడాది ఇదే కాలంలో సంఖ్యలతో పోలిస్తే దాదాపు 7.1% మేర జనాభా సంఖ్య  ఈ సంవత్సరం పెరుగుతుందని మంత్రిత్వ శాఖ  తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com