ఎయిర్‌టెల్ వారి మరో ఆఫర్!
- December 02, 2016
దేశంలోనే తొలి చెల్లింపు బ్యాంక్‌ను ప్రారంభించిన టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో తొలిసారి సేవింగ్స్ ఖాతా తెరిచిన వినియోగదారులకు ప్రతీ రూపాయి డిపాజిట్‌పై ఒక నిమిషం ఉచిత కాల్స్(ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్) సౌకర్యాన్ని కల్పించింది. కేవలం తొలిసారి ఖాతా ప్రారంభించిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
'ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంకులో మొదటిసారి ఖాతా ప్రారంభించిన ఏ వినియోగదారుడికైనా ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఖాతాలో జమ చేసే ప్రతీ రూపాయికి ఒక నిమిషం ఎయిర్‌టెల్ మొబైల్‌కు ఉచిత కాల్స్ అందిస్తాం' అని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.1000తో ఖాతాను ప్రారంభిస్తే అతని ఎయిర్‌టెల్ మొబైల్‌కు 1000 నిమిషాల ఉచిత టాక్‌టైం లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఏ ఎయిర్‌టెల్ మొబైల్‌కైనా ఈ టాక్‌టైం వినియోగించుకోవచ్చని సంస్థ తెలిపింది.
'ప్రతీ భారతీయుడి గడపకు బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఈ ఏడాది చివరి నాటికి రాజస్థాన్‌లో ఒక లక్ష మర్చెంట్లను ఇందులో భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం' అని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ సీఈవో శశి అరోరా వివరించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







