ఒమాన్ లో ఔషధ విలువలు గల వృక్ష సంపద
- September 02, 2015
ద రిసెర్చ్ కౌన్సిల్ వారి ఆర్ధిక సహకారంతో ఒమాన్ లో నిర్వహింపబడిన ఒక రసాయన మరియు జీవశాస్త్ర రంగ అధ్యయనంలో, ఒమాన్ అటవీ సంపదతో ఔషధ సమ్మేళనాలను తయారుచేసి, ఉత్పత్తి చేసేందుకు దారి సుగమమయింది. నిజ్వా విశ్వ విద్యాలయం ఆర్ట్స్ మరియు సైన్స్ ఫ్యాకాల్టీ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్ మరియు అసోసీయేట్ ప్రోఫెసర్ డా. జావేద్ హుస్సైన్ నేతృత్వంలోని ఒక కమిటీ, రాజ్యం లోని వృక్షాలు, మొక్కల యొక్క ఔషధశాస్త్ర సంబంధమైన కోణాన్ని, అత్యాధునిక, శాస్త్రీయ పద్ధతులలో వానిని వేరుచేసే విధానాలను కనిపెట్టింది. ఇంకా ఫంగస్, బాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై వీటి ప్రభావాన్ని, వీనిలో ఏవైనా విషపదార్ధాలు ఉన్నాయేమో అనే కోణాన్ని కూడా శోధించి, వాటిపై ప్రయోగాలు నిర్వహిస్తోంది. సుల్తానెట్ లో, ముఖ్యంగా నిజ్వా విశ్వ విద్యాలయం ఔషధ మొక్కలపై జరిగే ప్రత్యేక పరిశోధనలకు కేంద్రబిండువయింది.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







