సౌదీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మహిళలు

- September 02, 2015 , by Maagulf
సౌదీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఎన్నికలలో మహిళలు

డ్రైవింగ్ సహా అనేక విషయాలలో మహిళలపై నిషేధం ఉన్న ముస్లిం రాజ్యమైన సౌదీలో మహిళలు స్థానిక ఎన్నికలలో నిలబాడవచ్చు, పాల్గొనవచ్చనే చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది! రానున్న డిసెంబరులో జరగనున్న స్థానిక ఎన్నికలకు అందరు మహిళలే ఉండే ప్రత్యేక ఎలక్షన్ సెంటర్ల వద్ద మహిళలు రిజిస్ట్రేషన్ చేయించుకోడoతో ఈ మార్పు మొదలైంది. దివంగత అధినేత కింగ్ అబ్దుల్లా మహిళలకు ఓటు వేసేందుకు, ఎన్నికలలో నిలబడేందుకు హక్కు కల్పించారనే సంగతి విదితమే; ఇప్పటికి ఇంచుమించు 200 మంది మహిళలు రిజిస్ట్రేషన్లు చేసుకోడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలియవస్తోంది. దేశంలోని మొత్తం 284 మునిసిపాలి టీలలోని 1263 పోలింగ్ స్టేషన్లలో, 424 మహిళలకు కేటాయించబడ్డాయి.  కాగా, వోటర్ల రెజిస్ట్రేషన్ సెప్టెంబర్ 14 న, అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 17న ముగు స్తుంది. ఐతే కరడుగట్టిన చాందసవాదుల నుండి మహిళలకు సమాన హక్కులివ్వడం సరికాదనే తీవ్ర విమర్శలు, బెదిరింపులు షరా మామూలే!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com