దుమ్మురేపుతోన్న మన్యంపులి
- December 03, 2016
శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మించిన తాజా చిత్ర ‘మన్యంపులి’ ఈ శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరబాద్ ప్రసాద్ ల్యాబ్ లో మన్యంపులి యూనిట్ సభ్యులు థ్యాంక్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ..
మళయాలంలో 125 కోట్లకి పైగా కలెక్షన్స్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో ఆదరించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాను దాదపు రెండేళ్లకి పైగా చిత్రీకరించారని, పులి ఉన్న సన్నివేశాల్ని దాదాపు 40 రోజులకి పైగా చిత్రీకరిచినట్లుగా నిర్మాత తెలిపారు. మోహన్ లాల్ నటన, పీటర్ హేన్స్ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్, గోపీ సుందర్ మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్స్ అని, కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్స్ లో కూడా ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభిస్తోందని సింధూరపువ్వు కృష్ణారెడ్డి చెప్పారు. పెద్దలతో పాటు చిన్నపిల్లలు కూడా అలరిస్తోన్న ఈ సినిమాలో జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీ కుమార్, బ్యానర్ : సరస్వతి ఫిల్మ్స్
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







