పాకిస్థాన్‌కు అమెరికా రూ.6121 కోట్ల సాయం

- December 03, 2016 , by Maagulf
పాకిస్థాన్‌కు అమెరికా రూ.6121 కోట్ల సాయం

పాకిస్థాన్‌పై తనకున్న ప్రేమను అమెరికా మరోమారు బయటపెట్టింది. ఆ దేశానికి వివిధ రూపాల్లో రూ.6121 కోట్ల సాయం అందించాలన్న రక్షణ బిల్లుకు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం తెలిపింది. ఉగ్రవాద సంస్థ హక్కానీ నెట్‌వర్క్‌ను సమూలంగా తుడిచిపెట్టేందుకు పాక్ చర్యలు తీసుకుంటుందన్న ఉద్దేశంతోనే ఈ సాయానికి అమెరికా మొగ్గు చూపినట్టు సమాచారం. అమెరికా అందించనున్న సాయానికి అమెరికా నేషనల్ డిఫెన్స్ అథరైజేషన్ యాక్ట్-2017కు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం కూడా తెలిపింది. వివిధ దేశాలకు అమెరికా మొత్తం రూ.7481 కోట్లు సాయం చేస్తుంటే ఒక్క పాకిస్థాన్‌కే ఏకంగా రూ.6121 కోట్లు ఇవ్వనుండడం గమనార్హం. తాజా బిల్లు వచ్చే వారం సెనేట్ ఆమోదం కోసం రానుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com