అఫ్గానిస్తాన్‌లో ఓ విద్యార్థిని బహిరంగంగా ఉరితీశారు..
- December 03, 2016
తమ నిఘా అధికారిని హత్యచేశాడని ఆరోపిస్తూ తాలిబాన్ మిలిటెంట్లు అఫ్గానిస్తాన్‌లో ఓ విద్యార్థిని బహిరంగంగా ఉరితీశారు. కాబూల్ పాలిటెక్నిక్ వర్సిటీలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫైజుల్ రెహ్మాన్ అనే విద్యార్థి గురువారం కారులో ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో మిలిటెంట్లు అతన్ని అదుపులోకి తీసుకుని శుక్రవారం బహిరంగంగా ఉరితీశారని స్థానిక గవర్నర్ ప్రతినిధి ఒకరు చెప్పారు.ఈ ఘాతుకాన్ని అఫ్గానిస్తాన్ హోం మంత్రిత్వ శాఖ నిర్ధరించింది. దుశ్చర్యకు పాల్పడిన వారిని పట్టుకుని, శిక్షించేందుకు విచారణ ప్రారంభించినట్లు వెల్లడించింది. 2001 నుంచి తాలిబాన్ మిలిటెంట్లు ఎంతో మందికి బహిరంగ శిక్షలు అమలు చేశారు.అఫ్గానిస్తాన్, విదేశాలకు సమాచారం అందజేసిన వారిని, పెళ్లి చేసుకోకుండా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారిని బహిరంగంగా రాళ్లతో, కొరడతాలతో కొట్టడం వంటి శిక్షలు విధించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







