'వంగవీటి' ఆడియో వేడుక...

- December 04, 2016 , by Maagulf
'వంగవీటి' ఆడియో వేడుక...

వర్మ తాజా చిత్రం 'వంగవీటి'. బెజవాడ రౌడీయిజం, రాజకీయాలు నేపథ్యంలో తీసిన సినిమా ఇది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని వర్మ ముందు నుంచి చెబుతున్నారు. అయితే, సినిమా విషయంలో వంగవీటి కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పడంతో సీన్ సీరియస్ అయ్యింది. శనివారం వర్మ-వంగవీటి రాథా ల మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. ఎవరికి వారు తగ్గేది లేదని తేల్చిచెప్పారు. దీంతో.. 'వంగవీటి' సినిమా రిలీజ్ విషయం మరింత హీట్కెక్కింది.ఈ సీరియస్ సీన్ ఇలా కొనసాగుతుండగానే విజయవాడలో శనివారం రాత్రి 'వంగవీటి' ఆడియో వేడుక జరిగింది. కేయల్ యూనివర్సిటీ చైర్మన్ కోనేరు సత్యనారాయణ ఆడియో సీడీలను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. "నేను దర్శకుడిని కాకముందు నుంచి నాకు ఈ కథ గురించి తెలుసు. ఈ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు. నాకు అర్థమైన, నా అవగాహన దృష్టితో ఈ సినిమా తీశా"నన్నారు.సందీప్‌కుమార్, నైనా గంగూలీ, వంశీ, కౌటిల్య, శ్రీతేజ, ప్రజ్ఞ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది. రాజశేఖర్ పన్నాల, రవి శంకర్ లు సంగీతం సమకూర్చారు. దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com