వియత్నాంలో వరదలు, 13 మంది మృతి
- December 04, 2016
వరదల కారణంగా వియత్నాం అతలాకుతలం అవుతోంది. కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి బిన్డిన్ ప్రావిన్స్‌లో ఆరుగురు మృతిచెందారు. పదివేల ఇళ్లు నీటమునిగాయి. క్వాంగ్‌నామ్ ప్రావిన్స్‌లో ముగ్గురు చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయారు. సోమవారం నుంచి గురువారం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. వియత్నాంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వరదల కారణంగా ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు.
తాజా వార్తలు
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్‌స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..







