8న విడుదలకానున్న 'ఖైదీ నంబర్ 150' టీజర్
- December 05, 2016
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా రూపుదిద్దుకుంటోన్న 'ఖైదీ నంబర్ 150' (బాస్ ఈజ్ బ్యాక్) చిత్రం టీజర్‌ను ఈ నెల 8న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న కాజల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. డిసెంబరు 8 ప్రత్యేకమైన రోజు కాబోతోందని ట్వీట్ చేశారు. చాలా ఏళ్ల తర్వాత మెగాస్టార్‌ని తెరపై చూడాలని ఆతృతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తే అవుతుంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి 'ఖైదీ నంబర్ 150' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్‌స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్‌లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!







