తాత్కాలికంగా వీసా పనుల నిలిపివేసిన అమెరికన్ కాన్సులేట్
- December 05, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో చెన్నైలోని అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ కాన్సులేట్ అత్యవసర సందేశం జారీచేసింది. వ్యక్తిగత భద్రతకు సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలిపింది. ప్రస్తుతానికి ప్రజలు శాంతంగా ఉన్నా.. ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పే అవకాశాలు ఉన్నాయి. ర్యాలీలు, ఆందోళనలు జరిగే ప్రదేశాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. స్థానిక ప్రసార మాధ్యమాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీ జాగ్రత్తలో మీరు ఉండండి.. అని పర్యాటకులకు సూచించింది.
యూఎస్ కాన్సులేట్ ప్రస్తుతం కొంతమంది సిబ్బందితోనే పనిచేస్తోంది. వీసా ప్రాసెసింగ్ పనులు తాత్కాలికంగా నిలిపివేశామని, అవి పునరుద్ధరించిన అనంతరం ఈ-మెయిల్ ద్వారా తెలియజేస్తామని ప్రకటన జారీ చేసింది. గత కొద్దిరోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలిత నిన్న రాత్రి గుండెపోటుకు గురికావటంతో ఆమెను అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో అపోలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో, తమిళనాడులోని కొన్ని సున్నితమైన ప్రదేశాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







