పరిస్థితి విషమమే, ప్రార్థనలే ఆమెను కాపాడాలి : రిచర్డ్‌ బేలే

- December 05, 2016 , by Maagulf
పరిస్థితి విషమమే, ప్రార్థనలే ఆమెను కాపాడాలి : రిచర్డ్‌ బేలే

అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని లండన్‌ వైద్యుడు రిచర్డ్‌ బేలే వెల్లడించారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు జయ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఆమెను కాపాడేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ప్రపంచంలోనే అధునాతన చికిత్సను జయకు అందించినప్పటికీ ఆమెకు గుండెపోటు రావడం దురదృష్టకరమన్నారు. మన ప్రార్థనలే ఆమెను కాపాడాలని రిచర్డ్‌ వ్యాఖ్యానించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సోమవారం విడుదల చేసిన హెల్త్‌ బులెటెన్‌లో వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com