పరిస్థితి విషమమే, ప్రార్థనలే ఆమెను కాపాడాలి : రిచర్డ్ బేలే
- December 05, 2016
అన్నా డీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే వెల్లడించారు. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం ఎప్పటికప్పుడు జయ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ఆమెను కాపాడేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.ప్రపంచంలోనే అధునాతన చికిత్సను జయకు అందించినప్పటికీ ఆమెకు గుండెపోటు రావడం దురదృష్టకరమన్నారు. మన ప్రార్థనలే ఆమెను కాపాడాలని రిచర్డ్ వ్యాఖ్యానించారు. చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న జయలలితకు ఆదివారం సాయంత్రం గుండెపోటు రావడంతో ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటెన్‌లో వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అత్యంత వైభవంగా గీతం 17వ స్నాతకోత్సవం
- NEET UG 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
- అమెరికా వీసాల పై ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయం
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..
- లండన్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో షేక్ మొహమ్మద్ సందడి..
- బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..







