షూటింగ్ పూర్తిచేసుకున్న 'ప్లస్‌ వన్‌'

- December 08, 2016 , by Maagulf

రోషన్‌, ఆర్తి హీరో హీరోయిన్లుగా అళహరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'ప్లస్‌ వన్‌'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయినట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ నెల మూడో వారంలో 'ప్లస్‌ వన్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత విశ్వాస్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. 'యూత్‌ఫుల్‌ ఓరియంటెడ్‌గా ఈ సినిమాని నిర్మించాం. యువత అంటే అల్లరి చిల్లరిగా తిరగడమే కాదు అనుకోని సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎంత విజ్ఞతను ప్రదర్శించి అధిగమించాలి అనే అంశంతో చిత్రాన్ని చిత్రీకరించాం. యువతతోపాటు సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా నిర్మించాం' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com