తెర తొలగిన వేళ

ముఖం  చాటేసుకున్నాం 

మాట కట్టేసుకున్నాం
మనసు దాచేసుకున్నాం

చెరోవైపు మనమిద్దరమే 
మధ్యలో 
ఓ పల్చటి మంచుతెర 

చీకటి బిందువులమై 
కనులోయలలో జారిపడ్డాం
రెప్పలు మూసుకున్నాయి 
మూసుకున్న రెప్పలమాటున 
రాత్రంతా తడి పలకరించింది 

తొలికిరణం వెచ్చగా పూసింది 
మంచుతెర కరిగిపోయింది 
ఒకరికొకరం స్వచ్ఛంగా 
కనిపించినందుకు
ఒకరికొకరం స్పష్టంగా 
వినిపించినందుకు 
ఒకరిలో ఒకరం అచ్చంగా 
ఒదిగిపోయినందుకు
రంగులకు రెక్కలొచ్చి 
మబ్బుల్లో పందిరేసుకున్నాయి 

సఖీ ...
మరోమారు నీవలిగితే
మళ్ళీ తొలి రేయి, కాదంటావా...

పారువెల్ల

Back to Top