నాగ్, అమితాబ్ ముఖ్య అతిథులుగా వంగవీటి వేడుకకు
- December 09, 2016
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన లేటెస్ట్ సినిమా వంగవీటి విషయంలో పట్టు వీడటం లేదు. విజయవాడ హత్యారాజకీయాల నేపథ్యంలో వర్మ తెరకెక్కించిన వంగవీటి సినిమాను ఎన్ని అడ్డంకులు ఎదురైనా రిలీజ్ చేస్తానంటూ చెపుతున్నాడు. ఇప్పటికే సినిమాలో ప్రధాన పాత్రలైన వంగవీటి, దేవినేని కుంటుంబాలను కలిసిన వర్మ, విజయవాడ వేదికగా ఆడియో వేడుకను ఘనం నిర్వహించాడు. అయితే అదే సమయంలో కొంత మంది పెద్ద మనుషుల నుంచి సినిమా విడుదలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని విమర్శలు చేశాడు.ఈ నెల 23న రిలీజ్ కు రెడీ అవుతున్న వంగవీటి సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను ప్లాన్ చేస్తున్నాడు వర్మ. డిసెంబర్ 20న హైదరాబాద్ వేదికగా ఈ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నాడు.అంతేకాదు ఈ వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునతో పాటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఎనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేశాడు. ఇంత వివాదాస్పదమైన సినిమా ఫంక్షన్ లో ఈ స్టార్ హీరోలు పాల్గొంటారా..? ఒకవేళ పాల్గొన్నా సినిమాకు సంబంధించి ఏం మాట్లాడతారు..? అన్నది ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







