పంజాబ్లో ఘోర రోడ్డు ప్రమాదం ....13మంది ఉపాధ్యాయులు మృతి
- December 09, 2016
పంజాబ్లో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. 15మందితో వెళ్తున్న జీపు.. ట్రక్కును ఢీకొన్న ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన ఫజిల్కా జిల్లా కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలోని చందీపూర్ వద్ద చోటుచేసుకుంది. మృతులంతా ప్రభుత్వ ఉపాధ్యాయులే. వీరిలో ఐదుగురు మహిళలున్నారు.ఉదయం విధులకు హాజరయ్యేందుకు వీరంతా జీపులో బయలుదేరారు. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించకపోవడంతో వీరు ప్రయాణిస్తున్న వాహనం లారీని ఢీకొన్నట్లు ప్రత్యక్షసాక్షి తెలిపారు.ప్రమాద సమయం నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడగా..వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ అధికారులు, స్థానిక నేతలు సంఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉపాధ్యాయులు మృతికి సంతాపంగా స్థానికులు స్వచ్ఛంద బంద్కు పిలపునిచ్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







