ఖతార్‌లో ఎగ్జిట్ పర్మిట్ గ్రీవెన్సెస్ కమిటీ
- December 11, 2016
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, వలసదారుల ఎగ్జిట్ పర్మిట్స్‌కి సంబంధించిన గ్రీవెన్సెస్‌ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మినిస్ట్రీ అధికారులు కొత్త కమిటీని 'ఎగ్జిట్ పర్మిట్ గ్రీవెన్సెస్ కమిటీ' పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. యజమాని, వలసదారులకు దేశం విడిచి వెళ్ళేందుకు అనుమతించని పక్షంలో ఈ గ్రీవెన్స్ కమిటీ, ఆ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతుంది. డిసెంబర్ 13 నుంచి ఈ కమిటీ పని చేయడం ప్రారంభిస్తుంది. నార్త్ మదీనా ఖలీఫ్ - ఓల్డ్ ట్రాఫిక్ ఆఫీస్‌లో ఈ కమిటీ కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఫిర్యాదు అందిన మూడు రోజుల్లోపు కమిటీ తన నిర్ణయాన్ని ప్రకటించేలా కమిటీకి విధి విధానాల్ని మినిస్ట్రీ అందించింది. ఒకవేళ వలసదారుడి రిక్వెస్ట్ గనుక తిప్పి పంపబడినట్లయితే 24 గంటల్లోగా మినిస్ట్రీకి ఫిర్యాదు చేయవచ్చు. ప్రస్తుతం మ్యాన్యువల్‌గా ఫామ్ నింపేలా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత దీన్ని ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లోకి మార్చుతారు. కమిటీ ఛైర్మన్‌గా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - డైరెక్టర్ ఆఫ్ లీగల్ ఎఫైర్స్‌బ్రిగేడియర్ సలెం అల్ మెరైకి ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్, ఖతార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







