ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు మారణహోమం

- December 12, 2016 , by Maagulf
ఇస్తాంబుల్‌లో ఉగ్రవాదులు మారణహోమం

టర్కీలోని ఇస్తాంబుల్‌లోనూ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఫుట్‌బాల్ మైదానం సమీపంలో జరిగిన జంట పేలుళ్లలో 38 మంది మరణించగా, 155 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. మొదట ఫుట్‌బాల్ మ్యాచ్ పూర్తి కాగానే స్టేడియం వెలుపల శక్తివంతమైన బాంబు పేలింది. ఆ తర్వాత కొద్దిసేపటికే సమీపంలోని పార్కులో పోలీసు సిబ్బంది ఉన్న ప్రదేశంలో ఆత్మాహుతి దాడి జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com