నైజీరియా చర్చిలో ఘోర ప్రమాదం 160 మంది మృతి
- December 13, 2016
దక్షిణ నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఉయో నగరంలోని రెయినర్స్ బైబిల్ ఇంటర్నేషనల్ చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో చర్చి భవనం కూలిపోయింది. అందులో ఉన్న 160 మంది చనిపోయారు. వారి శవాలతో నగరంలో ఉన్న మార్చురీలన్నీ నిండిపోయాయని ఉయో యూనివర్శిటీలోని బోధానా దవానాఖానాకు చెందిన ఎటీట్ పీటర్స్ తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉన్నదన్నారు. ఇంకా నిర్మాణ దశలోనే ఉన్న చర్చి భవనంలో జరుగుతున్న బిషప్ నియామకానికి సంబంధించిన ప్రార్థనా కార్యక్రమాలకు హాజరుకావడానికి పెద్ద సంఖ్యలో మతస్థులు వచ్చారు. నిర్మాణానికి ఉపయోగిస్తున్న ఇనుప ఊచలు విరిగి భవన ఒక్కసారిగా కుప్పకూలి పోయింది. పైకప్పు విరిగి అక్కడున్న వారి మీద పడింది. దాంతో చాలామంది అక్కడికక్కడ చనిపోయారు. ఆ సమయంలో ఆక్వా ఇటోమ్ రాష్ట్ర గవర్నర్ ఉడోమ్ ఇమ్మాన్యుయేల్, బిషప్ వీక్స్ కూడా చర్చిలో ఉన్నా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







