బెంగుళూరు నుంచి సింగపూర్, కొలంబోకు విమాన సర్వీసులు

- December 13, 2016 , by Maagulf
బెంగుళూరు నుంచి  సింగపూర్, కొలంబోకు విమాన సర్వీసులు


బెంగళూరు నుంచి సింగపూర్, కొలంబోలకు రోజూ విమాన సర్వీసులను నడపనున్నట్లు జెట్ ఎయిర్‌వేస్ మంగళవారం ప్రకటించింది. రేపటి నుంచి సింగపూర్ సర్వీసు ప్రారంభమవుతుందని ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ప్రవీణ్ అయ్యర్ తెలిపారు. బెంగళూరు, సింగపూర్ మధ్య ప్రయాణికుల సంఖ్య ఏటా 15 శాతం పెరుగుతూ వస్తోందని ఆయన చెప్పారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ నుంచి రోజుకు రెండు ట్రిప్పులు, చైన్నై నుంచి ఒక ట్రిప్పు సింగపూర్‌కు నడుపుతున్నామని, జనవరి 5 నుంచి కొలంబోకు విమాన సర్వీసును ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com