ఖరారైన చంద్రబాబు దుబాయ్ పర్యటన

- December 14, 2016 , by Maagulf
ఖరారైన చంద్రబాబు దుబాయ్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దిలో భాగంగా అంతర్జాతీయ పెట్టుబడుల కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిఐఐ రోడ్ షో లలో భాగంగా విదేశీ పర్యటన చేయదలిచారు. అందులో భాగంగానే ఈ నెల 11 నుంచి 14 వరకు దుబాయ్ పర్యటన చేయాల్సి ఉంది. అయితే వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ కు వార్ధా తుఫాను ముప్పు హెచ్చరిక చేయడంతో, ఇందుకు సంబంధించిన సత్వర చర్యలను సమీక్షించుట కొరకు చంద్రబాబు తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు వాయిదా వేసిన దుబాయ్ పర్యటనను ఈ నెల 20 మరియు 21 తారీఖులలో పర్యటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com