మే 25 నుంచి రమదాన్ 2017!
- December 14, 2016
రమదాన్ పవిత్ర ఉపవాసాలు 2017 మే 25 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జూన్ 25తో ఈ ఉపవాస దీక్షలు ముగిసే అవకాశం ఉందని మూన్ సైటింగ్ రిపోర్ట్స్‌ని బట్టి అర్థమవుతోంది. రమదాన్ మాసం ముగిసే రోజు ఈద్ అల్ ఫితర్ ఇస్లామిక్ సెలవు దినం. జూన్ 25, 2017 అంటే అది ఆదివారం కానుంది. యూఏఈలో రమదాన్ సందర్భంగా పని గంటల్ని రెండు గంటల పాటు తగ్గించడం జరుగుతుంటుంది. న్యూ మూన్ సైటింగ్తో రమదాన్ ప్రారంభమవుతుంది. ఇస్లామిక్ క్యాలెండర్లో తొమ్మిదో నెలలో ఇది వస్తుంది. రమదాన్ మాసంలో పగటి పూట ఆహారం ఏమాత్రం తీసుకోకుండా ఉపవాస దీక్షల్ని స్వీకరిస్తుంటారు ముస్లిం సోదరులు. వాతావరణ పరిస్థితుల్ని బట్టి రమదాన్ పండగ ఒకరోజు అటు ఒకరోజు ఇటూగా ఉండొచ్చు. ఎందుకంటే మూన్ సైటింగ్ తర్వాతే రమదాన్ పండుగను జరుపుకుంటారు కాబట్టి. వేసవి కాలంలో రమదాన్ ఫాస్టింగ్ ఎక్కువ గంటలపాటు ఉంటుంది. అదే ఇతర కాలాల్లో మాత్రం తక్కువ సమయం ఫాస్టింగ్ ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







