రద్దు కాబడిన కతర్ జాతీయ దినోత్సవ వేడుకలు
- December 14, 2016
ఖతార్ : సిరియా దేశంలోని అలెప్పో నగర ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తూ కతర్ జాతీయ దినోత్సవ వేడుకలను రద్దు చేసేందుకు నిర్ణయించింది.ఎమిర్ శ్రీ శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ కతర్ జాతీయ దినోత్సవ వేడుకలు రద్దు నిర్ణయం ప్రకటించారని కతర్ వార్తా సంస్థ నివేదించింది. సిరియా దేశం అలెప్పో నగరంలో భారీగా హింస జరుగుతుందని ఏంతో మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారికి సంఘీభావంగా జాతీయ దినోత్సవ వేడుకల స్థాయిని తగ్గించుకునేందుకు తయారవుతోందని ఖతార్ నివేదిక పేర్కొంది. జాతీయ దినోత్సవ సందర్భంగా అన్ని ముఖ్యమైన కార్యక్రమాలను రద్దుకు చర్యలు తీసుకోవడం జరగనుంది.సిరియాలోని అలెప్పో నగరంలో జరుగుతున్న బాధాకరమైన సంఘటనల నేపథ్యంలో కతర్ లో వారికి సంఘీభావంగా అరదః దర్బ అల్ సాయి వేదిక వద్ద పాటలు పాడటం వంటి పండుగ సాంప్రదాయిక వ్యవహారాలను రద్దుని వారి అభీష్టం మేరకు విడిచిపెట్టారు అయితే, ఈ కార్యక్రమాలు డిసెంబర్ 20 వ తేదీ వరకూ అనుకున్నట్టు కొనసాగుతాడు. ఈ నిర్ణయం అలెప్పో నగర విషాద పరిస్థితికి స్పందనగా తీసుకొన్న నిర్ణయమని అక్కడ పౌరులు పోరాటం సంవత్సరాల తరబడి కొనసాగుతుందని మరియు చేదు ఘటనలతో కూడిన ముట్టడి మరియు నెలల తరబడి వేదనభరితమైన జీవితాలకు శాశ్వతమైన విముక్తి లభ్యం కావాలని కోరుకొంటుంది. ఖతార్ సైతం అలెప్పో నగరం యొక్క భయంకరమైన పరిస్థితిపై చర్చించడానికి అరబ్ లీగ్ కౌన్సిల్ అత్యవసర సమావేశం కోసం పిలుపునిచ్చారు. సమావేశంలో చర్చలు వివరాలను ఇంకా వెల్లడి కాలేదు.గత రెండు రోజులలో తూర్పు అలెప్పో ప్రతిపక్ష-ఆధీనంలోని ప్రాంతాల్లో పలువురు పౌరులు సిరియన్ పాలన దళాలు చేతులలో మరణించారు.డిసెంబర్ 18 వ తేదీన ఏ తరహా అర్ధ నృత్య సంగీతం బాణాసంచా తదితర వినోద కార్యక్రమాలు జాతీయ దినోత్సవ వేడుకలు నిర్వహించబడవని సెంట్రల్ మున్సిపల్ కౌన్సిల్ (సిఎంసి) హమద్ లహదం అల్ మొహాన్నది తెలిపారు. అయితే, డిసెంబర్ 18 వ తేదీన ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలు ఒక ప్రభుత్వ సెలవు ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







