లులు ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌కి ఐఎస్‌ఓ 9001 గుర్తింపు

- December 15, 2016 , by Maagulf
లులు ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌కి ఐఎస్‌ఓ 9001 గుర్తింపు

మనామా: లులు ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఐఎస్‌ఓ 9001:2015 మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ సర్టిఫికెట్‌ దక్కింది. క్వాలిటీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ని మెయిన్‌టెయిన్‌ చేయడం, అలాగే ఫారిన్‌ కరెన్సీ మారకంలో అత్యద్భుతంగా రెమిటెన్స్‌ ఆపరేషన్స్‌ నిర్వహించడానికి గుర్తింపుగా ఈ సర్టిఫికెట్‌ లభించినట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి. లులు ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌ జనరల్‌ మేనేజర్‌ సుధీష్‌కుమార్‌ ఈ సర్టిఫికెట్‌ని అందుకున్నారు. ఈ సర్టిఫికెట్‌ దక్కడం పట్ల చాలా ఆనందంగా ఉన్నామని, తమ కమిట్‌మెంట్‌కి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని లులు ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ఛేంజ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అదీబ్‌ అహమ్మద్‌ చెప్పారు. కస్టమర్‌ ఫోకస్‌, రిస్క్‌ బేస్డ్‌ అప్రోచ్‌, ప్రాసెస్‌ అప్రోచ్‌, కమిట్‌మెంట్‌ - టాప్‌ మేనేజ్‌మెంట్‌, కంటిన్యువల్‌ ఇంప్రూమెంట్‌ వంటి విభాగాల్లో పరిశీలించి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ని మంజూరు చేస్తారు. వేగవంతమైన అభివృద్ధి దిశగా సరైన అడుగులు వేస్తున్నామనడానికి ఈ గుర్తింపు ఉదాహరణ అనీ, ఈ రంగంలో తమ సేవల్ని మరింత విస్తృతం చేస్తామని అదీబ్‌ అహ్మద్‌ వెల్లడించారు.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com