తక్కువ బ్యాటరీతో పనిచేసే 'ప్యాసివ్ వైఫై'
- December 16, 2016
వైఫై.. మొబైల్ డేటాను ఆన్ చేశామంటే చూస్తుండగానే ఫోన్‌లో బ్యాటరీ ఖాళీ అయిపోతుంది. అందుకే బయటకు వెళ్లినప్పుడు ఛార్జింగ్ అయిపోతుందన్న భయంతో ఇంటర్నెట్ వాడేందుకు ఆలోచిస్తుంటాం. ఇప్పుడు ఆ సమస్యకు చెక్ పెట్టే సరికొత్త సాంకేతికతను యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. దానికి 'ప్యాసివ్ వైఫై' అని పేరు పెట్టారు. ప్రస్తుతం వాడుకలో ఉన్న వైఫై టెక్నాలజీతో పోల్చితే 10వేలలో ఒక వంతు ఛార్జింగ్‌తోనే ఈ కొత్త వైఫై పనిచేస్తుందట. అది ఎలా సాధ్యమవుతుందంటే. ప్రస్తుతం వైఫై సిగ్నల్స్ అనలాగ్ ఫార్మాట్‌లో ఉంటాయి. ఒక డివైజ్ నుంచి వైఫై సిగ్నల్ విడుదల అవ్వాలంటే ముందుగా బైనరీ కోడ్‌లోని సమాచారం వైఫై ట్రాన్స్‌మిటర్‌కి వెళ్తుంది.
ఆ తర్వాత అది అనలాగ్ సిగ్నల్స్‌గా మారి బయటకు వస్తుంది. ఆ సిగ్నల్‌ను రిసీవ్ చేసుకునే డివైజ్ వద్ద అనలాగ్ నుంచి బైనరీ కోడ్‌లోకి మారుతుంది. ఈ ప్రక్రియలో బైనరీ కోడ్ నుంచి అనలాగ్‌లోకి, అనలాగ్ నుంచి బైనరీలోకి మారేటప్పుడు బ్యాటరీపై అధిక భారం పడుతుంది. 'ప్యాసివ్ వైఫై'లో మాత్రం అలా జరగదట. అనలాగ్ సిగ్నల్‌కు బదులుగా డిజిటల్ బేస్‌బ్యాండ్‌లోనే వైఫై నెట్‌వర్క్ ఏర్పడుతుందట. దీంతో బ్యాటరీపై భారం చాలావరకు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ప్యాసివ్ వైఫై ద్వారా 11ఎంబీ/సెకన్ వేగంతో డేటాను బదిలీ చేసే వీలుందట. దాన్ని మరింత మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ వినియోగదారులకు ఇది ఉపశమనం కలిగించేదే.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







