'అమ్మ' జయలలిత జీవిత చరిత్ర మూవీలో నటించేందుకు రెడీ..

- December 18, 2016 , by Maagulf
'అమ్మ' జయలలిత జీవిత చరిత్ర మూవీలో నటించేందుకు రెడీ..

అమ్మ జయలలిత జీవిత చరిత్రను ఎవరైనా మూవీగా తెరకెక్కిస్తే బాగుంటుందని ఆమె అభిమాన నెటిజన్లు భావిస్తున్నారు. ఆమె పాత్రలో ఎవరు నటించాలన్న దానిపై ఊహాగానాలు సాగుతున్న దశలో .. 'బాహుబలి'లో శివగామిగా నటించిన రమ్యకృష్ణను జయలలిత మాదిరిగా ఫొటో షేప్ చేసి రూపొందించిన పోస్టర్ చటుక్కున సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఫుల్లీ ఫిల్మీ అనే ఫేస్‌బుక్ పేజీ ఈ పోస్టర్‌ను రూపొందించగా.. దీనిపై రమ్యకృష్ణ స్వయంగా స్పందించింది.కల్పితంగా క్రియేట్ చేసిన ఈ పోస్టర్‌ను వాట్సాప్‌లో తనకు తన ఫ్రెండ్స్ పంపారని, ఇది కల్పిత పోస్టర్ అయినప్పటికీ.. జయ జీవితంపై ఎవరైనా చిత్రం తీసేందుకు సిద్ధపడితే ఆమె రోల్‌లో నటించేందుకు ఎంతో ఉబలాటపడుతున్నానని తెలిపింది.

'బహుశా ఇప్పుడిది నా డ్రీమ్ రోల్ ఇదే' అని రమ్యకృష్ణ స్పష్టం చేసింది. జయలలిత చాలామంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని, అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని సినిమా తీస్తే అంతకన్నా కావలసింది ఏముంటుందని ఆమె పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com