పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌పై కేసు

- December 18, 2016 , by Maagulf
పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌పై కేసు

సినీనటుడు, జనసేనపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఓ న్యాయవాది సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్‌ కల్యాణ్‌.. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ధిక్కరిస్తూ జాతీయ గీతాన్ని అవమానించారని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని సుంకరి జనార్దన్‌గౌడ్‌ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. దేశంలోని సినిమాహాళ్లలో సినిమా ప్రదర్శించే ముందు తప్పనిసరిగా జాతీయగీతం ప్రదర్శింపచేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇటీవల ఆదేశించింది. సుప్రీంకోర్టు నిర్ణయం కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా నిర్ణయమా అంటూ పవన్‌కల్యాణ్‌ స్పందించడాన్ని న్యాయవాది జనార్దన్‌గౌడ్‌ తప్పుబట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com