లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలు రీ-సైక్లింగ్..
- December 18, 2016
లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలను వాటి తయారీదారులే కొనుగోలు చేసి రీ-సైక్లింగ్ చేసే విధంగా భారత ప్రభుత్వం త్వరలో ఓ చట్టాన్ని తీసుకురానుంది. గాలి కాలుష్యం దేశంలో విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా ఇందుకు ప్రధాన కారణమవుతున్న లక్షల కొద్దీ ఫిట్ నెస్ లేని బైకులు, కార్లు, బస్సులు, ట్రక్కులను రీ-సైక్లింగ్ చేసే బాధ్యతలను ఆయా కంపెనీలే తీసుకునేలా చేయాలని నిర్ణయించింది.
కార్ల లైఫ్ టైమ్ పూర్తయిన తర్వాత వాటిని రీ-సైక్లింగ్ కు పంపే పాలసీలు ఇప్పటివరకూ భారత్ లో లేవు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఏడాది నవంబర్ ఏర్పడిన కాలుష్య పొగలు కారణంగా పరిస్ధితులను చక్కదిద్దేందుకు వాతావరణ మంత్రిత్వ శాఖ నడుబిగించింది.
లైఫ్ టైం ముగిసిపోయిన వాహనాలను ఆయా కంపెనీలే రీ-సైకిల్ చేసేలా త్వరలో ఓ కొత్త రూల్ తీసుకురానుంది.
ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కొత్త ఏడాదిలో ప్రకటించనున్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ అనంతరం దేశంలోని పలు ప్రాంతాల్లో తయారీ కంపెనీలు రీ-సైక్లింగ్ సెంటర్లను నిర్మించుకునేందుకు రెండు నుంచి మూడేళ్ల పాటు సమయం ఇవ్వనుంది. చైనా, అమెరికా, యూరోపియన్ యూనియన్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఇప్పటికే ఈ పద్దతిని అమలు చేసి కాలుష్యాన్ని కొంతమేరకు అదుపు చేయడంలో సఫలీకృతమయ్యాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









