బాగా చెమటలు పట్టిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది....
- September 05, 2015
ఫ్యాన్, కూలర్స్ , ఏసిల కింద కూర్చొని చెమట పట్టనివ్వకుండా ఉన్నాసరే ఏదో తెలియని విసుగు ఉంటుంది. కాస్త పనిచేయగానే ఒత్తిడిగా ఫీలవుతారు. సహజసిద్ధంగా చేసే శారీరక శ్రమతో శరీరంలోని టాక్సిన్స్ వ్యర్థపదార్థాలు, మలినాలు అన్నీ చర్మందాటి బయటికి రావడానికి అవకాశముంటుంది. దాంతో చర్మ రంధ్రాలన్నీ తెరుచుకుని జిడ్డు, మురికి బయటికి వచ్చేస్తాయి. ముఖ్యంగా కొంత మన శరీరం అలసినప్పుడు చెమట పడితే, రెండవది వాతావరణం పరిస్థితుల ప్రభావం వల్ల చెమట పడుతుంది. అయితే చెమటపట్టకుండా జాగ్రత్తపడటం వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు వైద్యనిపుణులు. జిమ్, వ్యాయామాలు చేసి ఎంత అలసిసొలసి పనిచేస్తారో, ఏమేరకు చెమటలు పడతాయో అంతకన్నా ఎక్కువ ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చంటున్నారు నిపుణులు. మరి శరీరంలో చెమటలు పట్టించడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఒక సారి చూద్దాం... చెమటలు పట్టించడం వల్ల గుండె మరింత వేగంగా పనిచేస్తుంది. శరీరంలో రక్తప్రసరణ మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ ప్రొసెస్ లో శరీరంలో పుట్టే వేడి వల్ల శరీరం మరింత వేగంగా పనిచేయడానికి సహాయపడుతుంది. శరీరంలో చెమట ఎంత ఎక్కువగా పడితే అంత ఎక్కువ చర్మం శుభ్రపడుతుంది. దాంతో చర్మం మరింత ఆరోగ్యంగా, మాయిశ్చరైజర్ గా కనబడుతుంది. చెమట వల్ల శరీరంలో అదనపు నీరు కోల్పోవచ్చు మరియు అందువల్ల మరిన్ని ఎక్కువ నీరు త్రాగాలి. రోజులో ఎంత ఎక్కువ నీరు తీసుకుంటే కిడ్నీలకు అంత మంచిది. శరీరం ఎక్కువగా చెమట పట్టించడం ద్వారా మీ శరీరం నుండి టాక్సిన్స్ ను తొలగించుకోవచ్చు. వ్యాయామం లేదా జిమ్ వల్ల శరీరంలో చెమటలు పట్టిండ ద్వారా శరీరంలో కొన్ని మంచి కెమికల్స్ విడుదలవుతాయి. దాంతో మనస్సు ప్రశాంత పడుతుంది. చెమట వల్ల శరీరంలో యాంటీ బయోటిక్స్ చేరి జీవక్రియలకు అంతరాయం కలిగిస్తాయి. కాంట్టి, వాటిని నుండి రక్షణ కల్పించి మైక్రోఆర్గానిజమ్ చాలా ఎఫిషియంట్ గా పనిచేస్తుంది. చెమట పట్టడం వల్ల శరీరంలో గాయాలు మానుతాయని రీసెంట్ ఒక పరిశోధన ద్వారా తెలపడం జరిగినది చెమట పట్టడం మరియు వ్యాధినిరోధకత మద్య సంబంధం ఉన్నది. అందువల్లే ఆరోగ్య నిపుణులు చెమటలు పట్టించమని చెబుతుంటారు. వ్యామాలు, జిమ్ లను చేయమని సలహాలిస్తుంటారు. శరీరంలో చెమటలు పట్టడం వల్ల వేడి పుట్టి, జీవక్రియలు మరింత వేగంగా పనిచేస్తాయి . రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







