బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మెగా బ్రదర్స్ వీరాభిమాని!
- December 19, 2016
తన దంగల్ మూవీ ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్..టాలీవుడ్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. తెలుగు సినీ పరిశ్రమలో మీరెవరితో కలిసి నటించాలనుకుంటున్నారన్నప్రశ్నకు.. తడుముకోకుండా సమాధానమిచ్చాడు. నేను మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు వీరాభిమానినని, వారితో కలిసి నటించేందుకు ఎంతో ఇష్టపడతానని తెలిపాడు.
అంతేకాదు.. బాహుబలి మూవీ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని కూడా ఉందన్నాడు. భవిష్యత్తులో జక్కన్న మహాభారతం సినిమా తీస్తే..అందులో కర్ణుడి పాత్రనో, కృష్ణుడి రోల్ నో పోషించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆమిర్ చెప్పాడు. యంగ్ ఇండియన్స్ అండ్ యూత్ లీడర్ షిప్ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో ఈ నటుడు పాల్గొన్నాడు.
దంగల్ మూవీ డైరెక్టర్ నితేష్ తివారీ, మరి కొందరు స్టార్స్ కూడా ఈ గోష్టికి హాజరయ్యారు. హర్యానా లోని రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగత్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన ఈ సినిమా ఈ నెల 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- డాలస్ లో మహత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా 157వ గాంధీ జయంతి వేడుకలు
- దుబాయ్లో ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు గోల్డెన్ వీసాలు
- ముగ్గురు శాస్త్రవేత్తలకు 2026 నోబెల్ వైద్య శాస్త్ర పురస్కారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్
- పోలీస్ అమరవీరుల దినోత్సవానికి సిద్ధమవుతున్న గోషామహల్ స్టేడియం
- నదిలో రెండు పడవలు ఢీ..30 మంది మృతి
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!







