కోన వెంకట్ ని రంగంలోకి దింపుతున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్!
- December 19, 2016
త్వరలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ యాక్షన్ లోకి దిగబోతున్న విషయం తెలిసిందే. 'జనతా గ్యారేజ్' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చాలా కథలు విన్న తారక్.. చివరికి డాలీ చెప్పిన కథతో కనెక్ట్ అయ్యాడు. సంక్రాంతి తర్వాత నుంచి ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది.
ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేయనున్నాడు. మూడు పాత్రలు కూడా నటనకి స్కోప్ ఉన్న పాత్రలే. దీంతో.. ఈ సినిమాని ఛాలెంజ్ గా తీసుకొన్నాడు తారక్. ఇందుకోసం పక్కగా ప్లాన్ చేసుకొంటున్నాడు. ఈ మూడు పాత్రలని తెరపై మెయింటెన్ చేయాలని బలమైన కలం కావాలి. డైలాగులు అదిరిపోవాలి. మూడు పాత్రలని కన్విన్స్ చేయగలిగే డైలాగ్ రచయిత కావాలి. అందుకోసం ప్రముఖ డైలాగ్ రైటర్ కోన వెంకట్ ని రంగంలోకి దింపుతున్నట్టు సమాచారమ్.
ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. కోన కూడా చిత్రబృందంతో కలసిపోయి పని ప్రారంభించారు. ఇప్పటికే ఎన్ టీఆర్ తో జతకట్టే ముగ్గురు ముద్దుగుమ్మలు కాజల్, నివేదా థామస్, అనుపమ పరమేశ్వరన్ లని ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ దాదాపు రూ. 100కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారమ్.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







