ఎన్ఎస్ఈ దరఖాస్తుల ఆహ్వానం..
- December 19, 2016
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈ) నుంచి చిత్రా రామకృష్ణ వైలదొలగడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో) పదవులకు ఎన్ఎస్ఈ దరఖాస్తులను ఆహ్వానించింది. ఎన్ఎస్ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఓ ప్రకటనలో తెలిపింది. పదవుల భర్తీ పక్రియలో భాగంగా అర్హత కలిగిన వృత్తి నిపుణుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కోరింది. సంబంధిత రంగంలో 20ఏళ్ల అనుభవం ఉండాలని, ఆర్థిక వ్యవహారాలు, స్టాక్మార్కెట్లపై పట్టు ఉండాలని, అలాంటి వారు తమ దరఖాస్తులను జనవరి 11, 2017లోగా సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది.
ఎండీ, సీఈవో పదవులకు వచ్చిన దరఖాస్తులను నలుగురు సభ్యులు బృందం మదింపు చేయనుందట. అయితే ఈ సందర్భంగా పలువురి పేర్లను కూడా ఎక్స్ఛేంజీ సిఫారసు చేస్తుందని, తుది ఎంపిక మాత్రం బోర్డు నిర్ణయం మేరకే ఉంటుందని వెల్లడించింది.
అభ్యర్థుల మదింపు బృందంలో మహీంద్రా అండ్ మహీంద్రా ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఉషా తోరట్, ఎన్ఎస్ఈ స్వతంత్ర డైరెక్టర్లు టీవీ మోహన్‌దాస్ పై, దినేశ్ కన్బార్లు వ్యవహరిస్తారు.
ఎన్ఎస్ఈ ఎండీ, సీఈఓగా ఉన్న చిత్రా రామకృష్ణ తన బాధ్యతల నుంచి అనూహ్యంగా తప్పుకొన్న సంగతి తెలిసిందే. 2018 మార్చి చివరి వరకు ఆమె పదవీకాలం గడువు ఉన్నప్పటికీ ముందుగానే రాజీనామా చేయడం గమనార్హం. దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్ఎస్ఈకి ఆమె సేవలు అందించారు. బోర్డులోని కొందరి సభ్యులతో వైరుధ్యాల కారణంగానే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే వ్యక్తిగత కారణాల వల్లే చిత్రా రామకృష్ణ రాజీనామా చేసినట్లు ఎన్ఎస్ఈ వెల్లడించించింది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







