కమ్మని గొంతులు వినిపించబోతున్నాయి!!

- September 05, 2015 , by Maagulf
కమ్మని గొంతులు వినిపించబోతున్నాయి!!
కెరీర్ స్టార్టింగ్ లో యాక్టింగ్, గ్లామర్ పైనే ఫోకస్ పెట్టే హీరోయిన్లు.. కుదురుకున్నాక టాలెంట్ చూపించే ప్రయత్నాలు చేస్తుంటారు. శ్రుతిహాసన్, నిత్యామీనన్ లాంటి హీరోయిన్లు యాక్టింగ్ లో ఇరగదీయమే కాకుండా.. సింగింగ్ లోనూ దుమ్ములేపుతున్నారు. ఇంకొందరు సొంతంగా డబ్బింగ్ చెప్పే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో ఈ ట్రెండు ఇప్పుడు మరింత ఊపందుకుంటోంది. సమంత, తమన్నాలు ఇప్పటికే ట్రయిల్ రన్స్ వేశారు. శ్రీదేవి, త్రిషలాంటి సీనియర్లు కూడా సొంత గొంతుతో కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని మరికొందరు స్టార్ హీరోయిన్లు కూడా ఓన్ వాయిస్ తో మెస్మరైజ్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు.
 
ఫిలింనగర్ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. టాలీవుడ్ హాట్ కేక్స్ రకుల్ ప్రీత్ సింగ్, ప్రణీత.. సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని ఆరాటపడుతున్నారట. అప్పుడప్పుడు సినిమా ఫంక్షన్లలో వచ్చీరాని తెలుగులో మాట్లాడి ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసే ఈ ముద్దుగుమ్మలు.. తెలుగు లాంగ్వేజ్ పై పట్టు సాధించి మైక్ పట్టుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతం రకుల్, ప్రణీత ఇద్దరూ మంచి జోష్ మీద ఉన్నారు. ఇలాంటి టైమ్ లో సొంత గొంతు కూడా వినిపిస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుందని.. ఆ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారట. భాష కాని భాషలో యాక్సెంట్ సెట్ అవుతుందా.. యాస.. ప్రాస వర్కౌట్ అవుతుందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు సినీజనాలు. మరి ఆన్ స్క్రీన్ పై ఈ సెక్సీ బ్యూటీస్ రియల్ వాయిస్ ఎలా ఉంటుందో చూడాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com