దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఐదుగురికీ మరణశిక్ష...!!
- December 20, 2016
మూడేన్నరేళ్ల క్రితం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్ నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఈ రోజు ఎన్ఐఏ కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషులుగా రుజువైన అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఐజాజ్ లకు మరణశిక్ష విధిస్తున్నట్లు పేర్కొంది. అయితే, హైకోర్టు ఈ మరణశిక్షను ధ్రువీకరించాల్సి ఉంది. పేలుళ్ల నిందితుల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదని ఈ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. ఈ కేసులో విచారణ సందర్భంగా పలు ఆసక్తికర వాదనలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. నిందితులు కావాలని అమాయకులను పొట్టనబెట్టుకున్నారని ఆయన తెలిపారు.
వీరికి మరణించే వరకు ఉరిశిక్షే సరైనదని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించిన అనంతరం వారిని ప్రశ్నించిన సందర్భంగా వారి వైఖరి ఊహించని విధంగా ఉందని, నిందితుల్లో తీవ్ర వైఖరి ఉందని న్యాయస్థానానికి తెలిపారు.
దిల్ షుక్ నగర్ పేలుళ్ల కేసులో దోషులకు శిక్షల ఖరారు తీర్పు నేపథ్యంలో హైదరాబాదు పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో హైదరాబాదులోని సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందో బస్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







