'విరాట్' విశాఖకే..
- December 20, 2016
భారత నౌకాదళం నుంచి త్వరలో సేవలను ఉపసంహరించుకోనున్న ఐఎన్ఎస్ విరాట్ యుద్ధనౌకను సందర్శనశాల(మ్యూజియం)గా మార్చి, విశాఖపట్నంలో ఉంచుతామన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొద్ది నెలలుగా చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ పట్టుదల, గతంలో ఐఎన్ఎస్ కురుసుర జలాంతర్గామిని విశాఖపట్నంలో సందర్శనశాలగా ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించడం లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం.. ఐఎన్ఎస్ విరాట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించాలనే నిర్ణయానికొచ్చింది. 'విరాట్' అప్పగింతపై మంగళవారం ముంబయిలో నౌకాదళం నిర్వహించే కీలక సమావేశంలో పాల్గొనాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి ఆహ్వానం అందడంతో 13 మందితో కూడిన రాష్ట్ర అధికారుల బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది.
వివిధ శాఖల సీనియర్ అధికారులతోపాటు విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు చెందిన అధికారులూ బృందంలో ఉన్నారు. ఈ యుద్ధనౌకను సందర్శనశాలగా, నక్షత్ర హోటల్‌గా తీర్చిదిద్ది, విశాఖతీరంలో ఉంచే బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వుడాకు ఆదేశాలిచ్చింది. ఇందుకోసం రూ.1,700 కోట్ల వరకు వ్యయమవుతుందని నిపుణుల బృందం అంచనా వేసింది. 'విరాట్'ను ఉంచేందుకు విశాఖ నుంచి భీమునిపట్నం మధ్య తీరాన్ని ఆనుకుని ఉన్న మూడు ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







