పవన్ సినిమా ఆఫర్ రూమర్ అంటున్న నివేదా థామస్!
- December 20, 2016
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు తాను చేసే సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు అనే చిత్రాన్ని చేస్తోన్న పవన్, ఈ మూవీ తర్వాత మరో రెండు సినిమాలను మొదలు పెట్టనున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా చేస్తూనే సైమల్ టేనియస్ గా తమిళ దర్శకుడు ఆర్ టీ నీసన్ దర్శకత్వలో వేదాళం కి రీమేక్ గా ఓ చిత్రం చేయనున్నాడు. 2017లో సెట్స్ పైకి వెళ్ళనున్న ఆర్ టీ నీసన్ చిత్రం సమ్మర్ కి రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు కాగా, నటీనటుల ఎంపిక కూడా శరవేగంగా జరుగుతోంది.
నీసన్ తెరకెక్కించనున్న చిత్రం అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ ప్రధానాంశంగా ఉంటుందని తెలుస్తోండగా, ఇందులో పవన్ చెల్లెలిగా జెంటిల్మెన్ ఫేం నివేదా థామస్ ని ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఈ యంగ్ బ్యూటీ తన ట్విట్టర్ ద్వారా సమాధానం ఇచ్చింది. పవన్ చెల్లెలిగా నేను నటిస్తున్నాననే వార్త అబద్దం అని స్పష్టం చేసింది. నివేదా థామస్ ప్రస్తుతం డెబ్యూ డైరెక్టర్ శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నాని సరసన కథానాయికగా నటిస్తోంది.
తాజా వార్తలు
- పోస్టల్ పార్సిల్ .. గాజు కప్పుల్లో 40 వేల యాంఫెటమైన్ పిల్స్..!!
- అల్ ఖోర్ పోర్టులో నౌకలో అగ్నిప్రమాదం..!!
- మస్కట్‌లో ఉత్సాహంగా ‘వికసిత్ భారత్’ సాలిడారిటీ రన్..!!
- అబుదాబి-దుబాయ్ మధ్య వీకెండ్లో అదనంగా 6 రైళ్లు..!!
- అబుదాబిలో భారతీయ ప్రవాసిని వరించిన Dh25,000 బహుమతి..!!
- తైఫ్-రియాద్ హైవేపై ఘోరం.. ఐదుగురు టీచర్లు సహా ఆరుగురు మృతి..!!
- మనీ లాండరింగ్ కేసులో 8 మంది ప్రవాసులకు 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- సుస్థిర భవిష్యత్తుకు బహ్రెయిన్‌లో కొత్త కేంద్రం..!!
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక







