జనతా పార్టీ-శిరోమణి అకాళీదల్ కూటమి భారీ విజయం..
- December 20, 2016
చండీగఢ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ-శిరోమణి అకాళీదల్ కూటమి భారీ విజయం సాధించింది. మొత్తం 26 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా దానిలో 20 సీట్లు భాజపా-అకాలీదళ్ కూటమి గెలుపొందగా, కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 26 వార్డులకు జరిగిన ఈ ఎన్నికల్లో 122 మంది అభ్యర్థులు పోటీ చేయగా వారిలో 67 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. కాంగ్రెస్, భాజపా మొత్తం 26 స్థానాలకు పోటీపడగా బీఎస్‌పీ 17 వార్డుల్లో అభ్యర్థులను నిలిపింది. ఈ ఎన్నికల్లో 59.54శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు చెప్పారు.
36 మంది సభ్యులు గల చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 26మంది ఎన్నికైన కౌన్సిలర్లు కాగా 9మంది నామినేటెడ్ కౌన్సిలర్లు ఉంటారు. మరొకరు స్థానిక ఎంపీ.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్‌లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







