ఎంతవరకు ఈ ప్రేమ..
- December 20, 2016
జీవా హీరోగా, గ్లామర్ డాల్ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ కావలై వేండాం తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమ టైటిల్ తో డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ అందిస్తున్నారు. యామిరుక్క బయమేన్ ఫేమ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సార్ కంప్లీట్ చెసుకున్న ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ సందర్భంగా డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ మాట్లాడుతూ.. రంగం చిత్రం తెలుగులో ఎంత పెద్ద విజయాన్ని సాధించిందొ అందరికీ తెలిసిందే. ఆ చిత్రంలో హీరోగా నటించిన జీవా, స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కాంబినేషన్ అంటేనే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అలాగే ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్, పాటలకు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ముఖ్యంగా కాజల్ అగర్వాల్ పై చిత్రీకరించిన గ్లామర్ సన్నివేశాలు యూత్ ను వీపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఆమెకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాతో ఆ ఫాలోయింగ్ మరింత రెట్టింపు అవుతుంది. ఈ సినిమా హక్కులను దక్కించుకోవడం కోసం టఫ్ పోటీ ఎదురైనప్పటికీ ఫ్యాన్సీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాను. తమిళ్ తో పాటు తెలుగులో సైతం ఒకెసారి విడుదల చెయాలనుకున్నా, సమయానికి తెలుగు సెన్సార్ అవ్వక పోవటంతొ తెలుగు వెర్షన్ రిలీజ్ లేటయింది. సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ వచ్చింది. డిసెంబర్ 30న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చెస్తున్నాము. రంగం చిత్రాన్ని తమిళంలో నిర్మించిన ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను కూడా తమిళంలో నిర్మించటం విశేషమని అన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









