అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు అధునాతన సాంకేతికత..
- December 20, 2016
అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు సిద్ధంచేసిన ఓ అధునాతన సాంకేతికతను త్వరలో జపాన్ పరీక్షించనుంది. దీని ద్వారా ఖగోళ వ్యర్థాలను సేకరించి, ధ్వంసంచేసే అవకాశముంది. దీనిలో ఎలక్ట్రోడైనమిక్ టెథర్ (ఈడీటీ)గా పిలిచే 700 మీ పొడవైన సాధనముంది. దీన్ని ఓ వ్యోమనౌక అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. వ్యర్థాలు ఎక్కడున్నాయో కూడా చూపిస్తుంది. దీంతో వ్యర్థాలకు ఈడీటీ దగ్గరగా వెళ్లి, వాటిని గట్టిగా పట్టుకుంటుంది. అనంతరం వ్యర్థాలతో సహా ఈడీటీని వ్యోమనౌక భూ ఉపరితలం మీదకు తీసుకొస్తుంది. చివరగా వ్యర్థాలను ధ్వంసంచేస్తుంది.
ముఖ్యంగా వందల కేజీల బరువుండే భారీ అంతరిక్ష వ్యర్థాలను దీని సాయంతో తొలగించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు జపాన్ అంతరిక్ష సంస్థ వెల్లడించింది. ఈ సాంకేతికతలో జీపీఎస్ ద్వారా వ్యర్థాలను గుర్తిస్తామని స్పష్టంచేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







